జగన్ తో చిరంజీవి భేటీ ముహూర్తం ఖరారు

కొద్దీ రోజుల క్రితం చిరంజీవి తో జగన్ సమావేశం కానున్నారనే వార్త బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి జగన్ ..చిరంజీవి తో చర్చించనున్నారు. ఆగస్టు రెండో వారంలోనే వీరిద్దరూ భేటీ కావాల్సి ఉండగా..వాయిదా పడింది. ఈ క్రమంలో వీరిద్దరికి భేటీకి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ 4వ తేదీన సీఎంతో అప్పాయింట్ మెంట్ ఖరారు చేస్తూ చిరంజీవికి ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందింది. ఆ సమావేశంలో ప్రధానంగా చర్చకు కారణమైన బీ-సీ సెంటర్లలో టిక్కెట్ల ధరల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు రాయితీలు-ప్రోత్సాహకాలు కావాలని పరిశ్రమ పెద్దలు కోరుకుంటున్నారు. వీటన్నింటి గురించి సీఎంతో చర్చించే అవకాశం ఉంది.