మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..335 గొర్రెలు మృతి

రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్లలో చోటుచేసుకుంది. గొర్రెల మందను కుక్కలు తరమడంతో గొర్రెలన్నీ ఒక్కసారిగా రైలు పట్టాల మీదకు వచ్చాయి. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు గొర్రెలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 335 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. చనిపోయిన మూగజీవాల విలువ రూ.33.5 లక్షల మేర ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. వాటి మీదే ఆధారపడి జీవించే బాధితులు.. ఈ ఘటనతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఈ తరహా ఘటనే గత నెలలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట అనే గ్రామం వద్ద చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి కోల్‌కత్తా వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కింద పడి ఏకంగా 400 గొర్రెలు మృతి చెందాయి. సికింద్రాబాద్ నుంచి నాలుగు గంటలకు బయలు దేరిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. రామన్నపేట గ్రామ శివారులో ఉన్న పట్టాల మీదున్న గొర్రెలను గమనించకపోవటంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.