సీఎం జగన్‌పై రాపాక ప్రశంసల వర్షం

రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారు

rapaka vara prasada rao
rapaka vara prasada rao

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ రావు అసెంబ్లీలో ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్సాఆర్‌ బాటలోనే జగన్‌ పయనిస్తున్నారని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గతంలో వ్యవసాయం దండగ అని అన్నారని, వ్యవసాయం అంటే పండగ అని వైఎస్‌ నిరూపించారని రాపాక చెప్పారు. ఇప్పుడు జగన్‌ కూడా అదే పనిచేస్తున్నారని రాపాక వరప్రసాద్‌ చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రాపాక అన్నారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతి అని రాష్ట్రాభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నారని రాపాక తెలిపారు. ఇంకా సభ జరగకూడదనే ఉద్దేశంతో టిడిపి గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/