మీ గొడవలు మీరు చూసుకోండి..హరీష్ రావు కు మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్

gudivada amarnath
gudivada amarnath

ఏపీ ఫై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రులు వరుస పెట్టి కౌంటర్ లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు స్పందించగా..తాజాగా ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్..హరీష్ రావు కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని.. కానీ తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు 73% ఫిట్మెంట్ ఇచ్చామని హరీష్ రావు అన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ లాగా కేంద్రం షరతులకు ఒప్పుకొని ఉంటే.. ఏటా ఆరువేల కోట్లు అప్పులు తీసుకుని మరిన్ని పథకాలు ప్రవేశపెట్టే వారమని హరీష్ రావు అన్నారు.

ఇక హరీష్ రావు వ్యాఖ్యల ఫై వైస్సార్సీపీ మంత్రులు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ , సజ్జల రామకృష్ణ రెడ్డి తదితరులు కౌంటర్లు వేయగా..తాజాగా ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ హరీష్ రావు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన దుస్దితి వైస్సార్సీపీ కి లేదన్నారు. కేసీఆర్ కూ, హరీష్ రావుకూ తగువులుంటే వారూ వారూ చూసుకోవాలని అమర్నాథ్ సూచించారు. అంతే కానీ మా రాష్ట్రంపై ఎందుకు పడతారని ప్రశ్నించారు. మమ్మల్ని తిడితే మీకు అక్కడేమైనా మార్కులు పడతాయా అని అమర్నాథ్ హరీష్ రావును నిలదీశారు.

ఏపీతో పోలిస్తే తెలంగాణ ఆర్ధిక పరిస్ధితి ఎంతో బావుందని, హైదరాబాద్ ఉండటం వల్ల ఆర్ధిక పరిస్ధితి బావుండి ఏం సంక్షేమం చేస్తున్నారో చెప్పమని మంత్రి గుడివాడ అమర్నాథ్ హరీష్ రావును ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వాధికారుల్ని హరీష్ ఎలా ట్రీట్ చేశారో ప్రజలు చూశారని గుర్తుచేశారు. ఏపీ భవన్ లో ఓ అధికారిని హరీష్ రావు కాలితో తన్నలేదా అని అమర్నాథ్ ప్రశ్నించారు. మామా అల్లుళ్లకు తగువులుంటే చూసుకోవాలన్నారు. మా రాష్ట్రానికి నీతులు చెప్పే, సూచనలు చెప్పే అర్హత ఆ ప్రాంతంలోని నాయకులకు లేదని మంత్రి గుడివాడ హితవు పలికారు.

అంతకు ముందు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందింస్తూ..వారి రాష్ట్ర విషయాలను వారు చూసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాము స్పందిస్తే మరింత రచ్చ కావడం మినహ మరే ఉపయోగముండదని అన్నారు. ఉపాధ్యాయులతో తమ ప్రభుత్వం మంచిగా వ్యవహరిస్తుందని.. వారికి ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే చర్చలు జరపడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.