పవన్‌..సైనిక కుటుంబాలకు రూ.కోటి అందజేత

YouTube video

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. మిలటరీ డే సందర్భంగా సైనిక అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి గతంలో విరాళంగా ప్రకటించిన రూ.కోటి చెక్కును ్‌కేంద్రీయ సైనిక బోర్డు కార్యదర్శి బ్రిగేడియర్‌ మృగేందకుమార్‌కు అందజేశారు. సైనికాధికారులకు విరాళాన్ని అందజేసిన అనంతరం.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆయన కీలకపోన్యాసం చేయడంతోపాటు.. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. పవన్ గురించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొంటారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/