వెలిగొండ టన్నెల్‌ పనులను పరిశీలించిన సిఎం జగన్‌

AP CM Jagan
AP CM Jagan

ప్రకాశం: ఏపి ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను ఈరోజు ఉదయం పరిశీలించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రికి తొలుత మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టన్నెల్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక వాహనంలో టన్నెల్ లోపలకి వెళ్లారు. టన్నెల్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. జగన్ వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/