భారత్‌ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు

trump
trump

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఘన స్వాగతం పలుకుతున్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ‘నమస్తే ట్రంప్‌’ వేదిక వరకు వారు చేరుకోనున్నారు. భారత్‌కు ట్రంప్‌ రావడం ఇదే తొలిసారి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/