జిందం స‌త్త‌మ్మ ను ప్రపంచానికి పరిచయం చేసిన కేటీఆర్

జిందం స‌త్త‌మ్మ..ప్రస్తుతం ఈ పేరు గురించి రాజకీయ వ్యక్తులే కాదు యావత్ సోషల్ మీడియా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం మంత్రి కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన జిందం స‌త్త‌మ్మ..కేసీఆర్ , కేటీఆర్ లకు వీరాభిమాని. ఏమి చదువుకోక పోయినప్పటికీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రసంగాలు విని, స్వరాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని ఉద్యమ బాట పట్టింది. 2009 ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేటీఆర్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా స‌త్త‌మ్మ‌ ఉంది. కేటీఆర్ పాల్గొనే అన్ని కార్య‌క్ర‌మాల‌కు ఆమె హాజ‌ర‌వుతూ తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తుంది.

ఈ క్రమంలో కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ఈమె ప్రపంచానికి పరిచయం చేసారు. టీఆర్ఎస్ పార్టీ మ‌ద్ద‌తుదారు.. సీఎం కేసీఆర్ హార్డ్‌కోర్ అభిమాని అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆమెనే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జిందం స‌త్త‌మ్మ అంటూ.. కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. స‌త్త‌మ్మ తెలంగాణ ఉద్య‌మంలో యాక్టివ్‌గా ప‌ని చేశార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమెతో ఉద్యమ సమయంలో, స్వరాష్ట్రంలో మంత్రిగా వివిధ సందర్భాలలో కలిసిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. దీంతో ఇప్పుడు అంత ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు.

Let me introduce you to a very special #TRS supporter & a hardcore fan of #KCR Garu from my district; Jindam Sattamma Garu

She has been an active part of the #Telangana agitation & continues to be a pillar of support to me

Such unconditional affection & support is invaluable 🙏 pic.twitter.com/tH5YdsgAg5
— KTR (@KTRTRS) July 17, 2022