ఏపిలో పంచాయతి ఎన్నికల రెండవ విడత నామినేషన్లు

అమరావతి: ఏపిలో నేడు పంచాయతి ఎన్నికల రెండవ విడత నామినేషన్లకు గడువు ముగియనుంది. రెండు రోజులలో మొత్తం సర్పంచ్‌లకు 7358, వార్డు మెంబర్లకు 26080 నమోదైంది. అత్యధికంగా రెండు రోజులలో సర్పంచ్‌లకు అనంతపురంలో 835, వార్డు మెంబర్లకు తూర్పుగోదావరి లో 3810 నమోదైంది. ఈవాచ్ యాప్ నేటి నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. ఈవాచ్ యాప్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నామినేషన్లపై ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఎస్ఈసీకి ఫిర్యాదులు చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/