భారత 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన జగదీప్ ధన్ కడ్

రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం

YouTube video
PM Modi attends swearing-in ceremony of Shri Jagdeep Dhankhar as the 14th Vice President

న్యూఢిల్లీః భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లోని దర్భార్ హాల్ లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఇంకా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా విచ్చేశారు.

ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ధన్ కడ్ విపక్షాలు మద్దతు పలికిన మార్గరెట్ అల్వాను ఓడించారు. ధన్ కడ్ కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. 1997 నుంచి జరిగిన చివరి ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ఇక ధన్ కడ్ కు ఏన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం విశేషం. వీటిలో నవీన్ పట్నాయక్ కు చెందిన బిజూ జనతాదళ్, వైసీపీ, మాయావతికి చెందిన బీఎస్పీ తదితర పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/