నేడు గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో జగన్ యాత్ర

Jagan Yatra today in Gannavaram and Gudivada constituencies

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఆయన కనుబొమ్మ పైన గాయం అయింది. ఈ గాయానికి ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ ఘటన అనంతరం ఆయన తన యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు. కృష్టా జిల్లాలో జగన్ యాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం 9 గంటలకు కేసరపల్లి దగ్గర నుంచి యాత్ర ప్రారంభమయింది. సాయంత్రం 4.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడులో మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. ఈ రాత్రికి ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం దగ్గర బస చేస్తారు. కాసేపట్లో మేమంతా సిద్ధం యాత్ర గన్నవరంకు చేరుకుంటుంది. గుడివాడ, ఉంగుటూరు జిల్లాలో ఈనాటి యాత్ర కొనసాగుతుంది.