కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

కృష్ణాష్టమి సందర్భాంగా ప్రజలందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ‘మానవాళికి కర్తవ్యబోధ చేసిన భగవద్గీత.. సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్‌ శ్రీకృష్ణుడి పుట్టినరోజు అందరికీ పర్వదినం. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’ అని జగన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. మరోపక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వాడవాడలా ఘనంగా జరగనున్నాయి.

ఇక అనంతపురములోని ఇస్కాన్‌ మందిరాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. విశ్వశాంతి యజ్ఞంతో గురువారం వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. ఉదయం నుంచే ఇస్కాన్‌ మందిరం భక్తులతో కిటకిటలాడింది. రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరించారు.