గుంటూరులో లైగర్ ప్రీ రిలీజ్ వేడుక

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..మరోపక్క వరుస ప్రమోషన్స్ తో సినిమా ఫై విపరీతమైన ఆసక్తి పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు నార్త్ లో ఎక్కువగా ప్రమోషన్ కార్య క్రమాలు చేసిన మేకర్స్..తాజాగా గుంటూరు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిక్స్ చేసారు. రేపు గుంటూరులోని చ‌ల‌ప‌తి ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వహించబోతున్నట్లు మేక‌ర్స్ అధికారిక ప్రకటన తెలుపుతూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.