ఈ-కేవైసీపై జగన్‌ సర్కార్‌ కీలక ప్రకటన

cm-jagan

అమరావతిః ఏపీ రైతులకు జగన్‌ సర్కార్‌ ఈ-కేవైసీపై కీలక ప్రకటన చేసింది . ప్రస్తుత రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని తెలిపారు అధికారులు. త్వరగా ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదును పూర్తి చేయాలంది. అటు పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంకు అకౌంట్లు లింక్ చేయనివారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపింది. కాగా కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు దక్కింది. FSSAI నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడ డివిజన్ లో ఈ హోదా పొందిన తొలి స్టేషన్ ఇదే కాగా….జోన్ లో నాంపల్లి తర్వాత రెండవ స్థానంలో నిలిచింది.