ఏపీలో మూతపడిన థియేటర్స్ కు జగన్ గుడ్ న్యూస్

ఏపీలో సీజ్ చేయబడిన థియేటర్స్ కు గుడ్ న్యూస్ తెలిపారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. నిబంధనలు పాటించని పలు థియేటర్స్ ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ తరుణంలో సీజ్ చేయబడిన థియేటర్స్ కు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. నెల రోజుల గడువుతో నోటీసులు ఇవ్వనున్న జేసీలు.. ఈ గడువు లోపు పెనాల్టీలు కట్టి సరిచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయం తో 9 జిల్లాల్లోని 83 థియేటర్లు మళ్ళీ ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని థియేటర్ యజమానులకు సూచించారు మంత్రి పేర్ని నాని.

గురువారం మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్‌ ఓనర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతిచ్చారు. అయితే థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయని థియేటర్లలో తనిఖీలు నిర్వహించడంతో పాటు పలు చర్యలు కూడా తీసుకుంది. టికెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నా, క్యాంటీన్లలో రేట్లు పెంచినా, లైసెన్స్ లు లేకున్నా చర్యలకు దిగింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలతో పాటు డిస్టిబ్యూటర్లు బెంబెలేత్తారు. ప్రభుత్వం వద్దకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని వారితో చర్చలు జరిపి థియేటర్స్ ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.