జగన్‌ అక్రమాస్తుల కేసు.. సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలో జాప్యం జరుగుతోందని రఘురాజు పిటిషన్

Jagan illegal assets case.. Supreme Court notice to CBI

న్యూఢిల్లీః ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సీబీఐని ప్రశ్నించింది. విచారణ ఆలస్యానికి గల కారణాలు చెప్పాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్ సహా కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.