జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా..

ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్​పై తీర్పు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా పడింది. గత కొద్దీ రోజులుగా జగన్ బెయిల్ ఫై కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో అని యావత్ తెలుగు ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఈరోజు తీర్పు వెలువడడం ఖాయమని అంత భావించారు కానీ కోర్ట్ మాత్రం సెప్టెంబర్ 15వ తేదికి వాయిదా వేసేసరికి మరికొన్ని రోజులు ఎదురుచూడకతప్పదు. మరో వైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా అదే రోజు తీర్పు వెలువరించనున్నట్టు సీబీఐ కోర్టు తెలిపింది. అంటే ఒకే రోజు రెండు కీలక తీర్పులు వెలువడనున్నాయి.

ముఖ్యమంత్రి ఉన్నత పదవిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, ఆయన తన అధికారారిన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌ దాఖలు చేయడం జరిగింది. కృష్ణంరాజు వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు.