ఆర్ఆర్ఆర్ నిర్మాతతో చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఓ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో మూవీ ని ప్రకటించడం..సెట్స్ పైకి తీసుకెళ్లడం చేస్తూ యువ హీరోలకు ఆదర్శం గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే వేదాళం రీమేక్ తో పాటు లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు. ఈ మూడే అనుకుంటే మరో రెండు సినిమాలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న మారుతీ..చిరంజీవి కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే ఆ లైన్ చిరు కు వినిపించగా ..ఓకే చెప్పారట. ఫుల్ స్క్రిప్ట్ అవ్వగానే చిరు కు చెప్పబోతున్నాడు. ఒక వేళ ఓకే అయితే మాత్రం వీరిద్దరి కాంబో మూవీ ని యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తారు. మరో మూవీ విషయానికి వస్తే..ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య చిరు తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ ను వెతికే లో దానయ్య ఉన్నాడట. చిరు ఇమేజ్ కు తగ్గట్లు కథ దొరికితే సినిమా సెట్స్ పైకి రావడం ఖాయం. మొత్తం మీద చిరు స్పీడ్ చూస్తే అందరికి ఆశ్చర్యం కలుగుతుంది.