కనిపించిన బిలియనీర్‌ జాక్‌మా

తాజాగా టీచ‌ర్ల‌తో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న‌ జాక్ మా

బీజింగ్‌: చైనా వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు మూడు నెలల నుంచి కనిపించడం లేదన్న విష‌యం తెలిసిందే. అయితే జాక్‌మా క‌నిపించారు. బుధ‌వారం జ‌రిగిన ఆన్‌లైన్ కాన్ఫ‌రెన్స్‌లో ఆయ‌న టీచ‌ర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం చేశారు. గ్రామీణ స్థాయిలో విద్యావృత్తి చేప‌డుతున్న టీచ‌ర్ల‌ను ఆయ‌న మెచ్చుకున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ నుంచి బిలియ‌నీర్ జాక్ మా అదృశ్యం అయ్యారు.


కాగా, చైనాలో చోటు చేసుకుంటోన్న‌ పరిణామాల నేపథ్యంలో ఆ దేశ‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఆయ‌న బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలపై గ‌తంలో విమ‌ర్శ‌లు చేశారు. దీంతో చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ ప్రభుత్వంతో వివాదం తలెత్తిన నేప‌థ్యంలో ఆయ‌న క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జాక్ అదృశ్యం అయ్యారంటూ ప్ర‌చారం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న తాజాగా కనిపించారు.

ఈ నేప‌థ్యంలో ప్రతి ఏడాది ఆయ‌న ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. క‌రోనా నేప‌థ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జాక్ మా.. త్వరలోనే ఆ ప్రాంతానికి వచ్చి కలుస్తానని ప్ర‌జ‌ల‌కు చెప్పారు. దీంతో జాక్ మా ఏమైపోయారంటూ వ‌స్తోన్న ప్ర‌చారానికి తెర‌ప‌డింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/