ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన ఇటలీ ప్రధాని

‘Modi Most Loved Among World Leaders’: Italian PM Meloni Says After Arriving in India

న్యూఢిల్లీః భారత్‌లో ప్రతీ ఏటా జరిగే నిర్వహించే బహుపాక్షిక సదస్సు రైసినా డైలాగ్ ఎనిమిదో ఎడిషన్‌కు హాజరయ్యేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గురువారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సంరద్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. జార్జియకు స్వాగతం పలికారు. గురువారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు జార్జియా. ఐదేళ్లలో యూరోపియన్‌ దేశానికి చెందిన తొలి అగ్రనాయకురాలు జార్జియా నిలిచింది.

కాగా, ఈ సందర్భంగా మాట్లాడిన జార్జియా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజామోదం కలిగిన నాయకుడిగా నిలిచిన మోడీకి జార్జియా మెలోని శుభాకాంక్షలు తెలిపారు. ఇది మోడీ నాయకత్వం ప్రతిభకు నిదర్శమని, రెండు దేశాలు కలిస్తే మరెన్నో అద్భుతాలు చేయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, ఎనిమిదవ రైసినా డైలాగ్ ప్రారంభ సెషన్‌లో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ముఖ్య అతిథి, ముఖ్య వక్తగా పాల్గొంటారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) సహకారంతో మార్చి 2-4 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ పర్యటన భారత్, ఇటలీల మధ్య చిరకాల బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.