మళ్లీ రాహుల్‌కు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు?
పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు తీసుకోనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇటీవల కాలంలో రాహుల్ ప్రమేయం పార్టీ కార్యక్రమాల్లో పెరుగుతూ వస్తోంది. రామ్‌లీలా మైదానంలో ఇటీవలే జరిగిన భారత్ బచావో ర్యాలీలో రాహుల్ కీలక పాత్ర పోషిచారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజ్‌ఘాట్ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్ష, మీరట్‌లో సిఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ వెళ్లడం వంటి పరిణామాలు ఆయన మళ్లీ పార్టీ అధ్యక్ష పదవి సన్నద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రా పిసీసీల్లో చోటు చేసుకోబొతున్న మార్పులు, చేర్పులలో రాహుల్ ఉత్సాహం కనబరుస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలను తీసుకుంటారా? లేదా అని.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/