భారీగా పెరిగిన బంగారం ధర

అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్నా ఉద్రిక్తలే ఇందుకు కారణం

gold rate hike
gold rate hike

హైదరాబాద్‌: బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. సెప్టెంబర్ నెలలో ఆల్‌టైమ్ హై రూ.40,000 దాటిన పసిడి ఆ తర్వాత రూ.37,000 నుంచి రూ.38,000 మధ్య కనిపించింది. ఇటీవల క్రమంగా పెరుగుతూ రూ.39వేల మార్క్ చేరుకుంది. తాజాగా, అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం శుక్రవారం (జనవరి 3) భారీగా పెరిగింది. శనివారం కూడా అదే పరిస్థితి. జనవరి 3న ఆరేళ్ల గరిష్టానికి సమీపంలో నిలిచింది. 10 గ్రాముల 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం ఢిల్లీలో ఏకంగా రూ.752 పెరిగి రూ.40,652కు చేరుకుంది. డాలర్ మారకంతో రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక కిలో వెండి రూ.960 పెరిగి రూ.48,870కి చేరుకుంది .

తాజా తెలంగాణ క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/