అందరికీ ఆరోగ్యం సాధ్యమేనా?

ఆరోగ్యం- జీవన శైలి

Is Health Possible for All?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆధునిక నాగరికత సంతరించుకున్న నేటి కాలంలో అందరికి ఆరోగ్యం అనేది ప్రశ్నార్థకమే.

ఏ వ్యాధి లేదా అనారోగ్యం లేకుండా ఉండడమే ఆరోగ్యం కింద పరిగణించాలా అని వైద్యరంగంలో పెనుసవాలుగా నిలిచింది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్లే ఆరోగ్యవంతులు కదా!

చరిత్ర:

జోహన్నా పీటర్‌ ఫ్రాంక్‌ (1745-1821లో) అనే హెల్త్‌ ఫిలాసఫర్‌ ఆరోగ్యంపై అవగాహన కల్గి ఉండాలని అందరికి తెలియజేశాడు. లండన్‌లో 1816-1904లో మొదటి ఆరోగ్యాధికారి అయిన సర్‌జాన్‌ సిమన్‌ కలరా పబ్లిక్‌హెల్త్‌ని ఎలా ఎఫెక్ట్‌ చేస్తుందో తెలియచేశాడు.

మశాచుట్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో 1793-1859 వరకు లెమ్యూల్‌ షాటర్‌ అనే శా్తవేత్త అనేక పరిశోధన పత్రాలు, బుక్స్‌, హెల్త్‌ కండీషన్స్‌పై ప్రచురించడం జరిగింది.

వ్యక్తిగత ఆరోగ్యం, పబ్లిక్‌హెల్త్‌, హెల్త్‌ కండీషన్స్‌పై ఆధునిక వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. 1848లో పబ్లిక్‌ హెల్త్‌ ఆక్ట్‌ని తీసుకొని రావడం వల్ల వైద్యరంగంలో నూతన శకానికి నాంది పలికింది.

1) 1880-1920 వరకు డిసీజ్‌ కంట్రోల్‌ఫేజ్‌గా 2. 1920-1960 వరకు హెల్త్‌ ప్రమోషనల్‌ ఫేజ్‌గా3. 1960-1980 వరకు సోషల్‌ ఇంజినీరింగ్‌ ఫేజ్‌గా4.

1981-2020 వరకు హెల్త్‌ఫర్‌ఆల్‌ ఫేజ్‌గా నిర్ధారించడమైంది. అమెరికా, యుఎస్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలకన్నా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఆరోగ్య ప్రాముఖ్యత ముఖ్యమని జాన్‌బ్రయంట్‌ అనే శాస్త్రవేత్త తెలియచేయడమైనది.

హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అయిన డాII ఫ్రాన్సిస్‌ 1923లో ఫ్యామిలో కమ్యూనిటీ హెల్త్‌ వల్ల చాలావరకు వ్యాధుల్ని నయం చేయవచ్చని తెలియచేయడమైనది.

ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరి ప్రాథమికహక్కు అంతేకాని వ్యాధిని నయం చేసి డాక్టర్లది, హాస్పటల్స్‌ది. సోషల్‌ సర్వీసెస్‌ది కాదు. ఇది ఒక సోషల్‌ జస్టిస్‌ అని చెప్పవచ్చు.

బయోలాజికల్‌గా శరీరంలోని ప్రతి కణం, అవయం సమర్ధవంతంగా, నార్మల్‌గా పనిచేయడాన్ని ఆరోగ్యంగా నిర్వహించవచ్చు.

సైకాలజికల్‌గా మనస్సు, మెదడు, ఫీలింగ్స్‌ ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా ఎన్విరాన్‌మెంటల్‌కి అనుగుణంగా సహజంగా ప్రతిస్పందించడాన్ని కూడా ఆరోగ్యంగా నిర్వచించవచ్చు.

సోషల్‌గా వారి శక్తి సామర్థ్యాన్ని బట్టి కుటుంబంతో సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అందరితో సరైన సంబంధ బాంధవ్యాలికల్గి ఉండడాన్ని కూడా ఆరోగ్యంగా నిర్వచించవచ్చు.

1948లో ప్రపంచ ఆరోగ్యసంస్థపై మూడింటిని పరిగణనలోకి తీసుకోని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సంపూర్ణంగా, సంపూర్తిగా, ప్రశాంతంగా ఉండడాన్ని ఆరోగ్యంగా నిర్వచించింది.

1974లో గ్లోబల్‌ హెల్త్‌గా అందరికి ఆరోగ్యమనే భావనను కల్గించింది. 1984లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, వ్యాధులు రాకుండా, నిర్మూలించడంలో సరైన జీవన సరళిని పెంపొందించుకోవాలని పాజిటివ్‌నెస్‌ని అందరూ కల్గి ఉండాలని. హెచ్చరించడమైనది.

2011లో వన్‌ హెల్త్‌ వన్‌ వరల్డ్‌ అనే ప్రతిపాదికపై ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో అంతర్జాతీయ ఆరోగ్య సదస్సు నిర్వహించడమైనది.

1800లో రుడాల్ఫ్‌ విర్చో నుండి 1947లో జేమ్స్‌ హెచ్‌ స్టీల్‌, క్లానిక స్క్వాచ్‌ శాస్త్రవేత్తలు పబ్లిక్‌ హెల్త్‌ గురించి, మనుష్యులకు పెంపుడు జంతువ్ఞల నంఉడి వచ్చే వ్యాధుల గురించి జాగ్రత్తల గరించి వివరించడమైనది. ఆరోగ్యాన్ని ఫిట్‌నెస్‌, హెల్త్‌నెస్‌, హార్టీనెస్‌, వెల్‌నెస్‌, హాల్‌నెస్‌ అనే వివిధ పేర్లతో వ్యవహరిస్తారు.

ప్రాముఖ్యత:

ఆరోగ్యం గురించి సరైన ఆరోగ్య సరళి అలవాట్ల గురించి చిన్నప్పటి నుంచి అవగాహన కల్గి ఉండడం వల్ల చాలావరకు వ్యాధులురాకుండా ఆరికట్టవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అనే భావన అందరిలో కల్గించడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎన్నో ప్రణాళికలు పధకాలు రూపొందించడమైనది.

రకాలు: 1ఫిజికల్‌ హెల్త్‌, 2 మెంటల్‌ హెల్త్‌, 3స్పిర్చువల్‌ హెల్త్‌, 4. ఎమోషనల్‌ హెల్త్‌, 5. ఫైనాన్షియల్‌ హెల్త్‌, 6 సోషల్‌ హెల్త్‌, 7. ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అని 7 విధాలుగా ఉంటుంది.

Is Health Possible for All?

ఫిజికల్‌ హెల్త్‌:

శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి టైమ్‌ ప్రకారం లేవడం, సరైన పోషకాహారం నిర్ణీతవేళల్లో మితంగా తీసుకోవడం, ఎక్స్‌ర్‌సైజ్‌ చేయడం శరీర బరువ్ఞని వయస్సు, ఎత్తు, తగ్గినట్టు ఉంచుకోవడం తగినంత విశ్రాంతి ముఖ్యం. సరైన లైఫ్‌స్టైయిల్‌ అలవాట్లే మీ ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతాయి.

పొగాకు, ఆల్కహాల్‌, డ్రగ్స్‌ వంటి చెడుఅలవాట్లు మానివేయడం అన్నివిధాలా మంచిది. శారీరక దృఢత్వంవల్ల డయాబెటిస్‌, కేన్సర్‌, కార్డియో, వాస్కులార్‌ డిసీజెస్‌, స్థూలకాయం, హైపర్‌టెన్షన్‌ రాకుండా అరికట్టవచ్చు.

సెల్ఫ్‌కేర్‌, ఆరోగ్యంపై సరైన అవగాహన కల్గి ఉండడం ఉత్తమం. వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షితమైన సెక్స్‌, వాక్సినేషన్‌ సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స తీసుకోవడం మంచిది.

Is Health Possible for All

మెంటల్‌ హెల్త్‌:

మానసిక పరిణామాలు శరీరారోగ్యాలపై ప్రభావం చూపుతారు. రెండింటికి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం వుంది,

కాగ్నేనిటివ్‌, ఎమోషనల్‌, స్ట్రెస్‌ ఎక్కువైన డిప్రెషన్‌, స్క్రీజో ఫ్రినియా, ఆటిజమ్‌, ప్రతికూలపరిసిబీతులు తీవ్రంగా స్పందిం చడం, భావోద్వేగాల్ని కంట్రోల్‌ చేసుకోలేకపోవడం, అధిక దుఃఖం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

కాబట్టి మెంటల్‌ బ్యాలెన్స్‌, స్ట్రెస్‌ రిలాక్సేషన్‌, సరైన సంబంధ బాంధవ్యాలు కల్గి ఉండడం మంచిది.

  • డాక్టర్‌. కె.ఉమాదేవి, తిరుపతి

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/