చిక్కుడు కాయతో వెరైటీ వంటకాలు

రుచి: ‘చెలి’ పాఠకులకు ప్రత్యేకం

Variety of dishes with beans
Variety of dishes with beans

చిక్కుడుకాయ బిర్యానీ

కావలసినవి:

బాస్మతి బియ్యం: పావుకిలో, చిక్కుడుకాయలు- పావ్ఞకిలో
నూనె-100మి.లీ, యాలకులు- నాలుగు
జీలకర్ర- టీస్పూను, దాల్చినచెక్క- చిన్నముక్క
కొబ్బరిపాలు- పావ్ఞకప్పు, వెల్లుల్లి తురుము- టేబుల్‌స్పూను,
పసుపు- అరటీస్పూను, పలావ్ఞ ఆకులు- రెండు, ఉప్పు-తగినంత, నిమ్మకాయ-ఒకటి
కొత్తిమీర తురువ్ఞ- 2 టీసూన్లు, గరంమసాలా-టీస్పూను

తయారు చేసేవిధానం:
బాస్మతి బియ్యం కడిగి ఉంచాలి. ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లులి, బిర్యానీ ఆకులు వేసి వేగాక పసుపువేసి కలపాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.

తరువాత బియ్యం వేసి ఓసారి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, సుమారు గ్లాసున్నర నీళ్లుపోసి ఉప్పువేసి కలపాలి. తరువాత గరంమసాలా వేసి మూతపెట్టి ఓ రెండు విజిల్స్‌ రానివ్వాలి. తరవాత ఉప్పు వేసి చూసి నిమ్మరం పిండి కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి.

చిక్కుడుకాయ వడలు:

కావలసినవి
సెనగపప్పు- కప్పు, చిక్కుడుగింజలు- కప్పు, ఎండుమిర్చి-నాలుగు
అల్లం తురుము- టీస్పూను, ఉల్లిపాయ- ఒకటి
కొత్తిమీర తురుము: పావ్ఞకప్పు, కరివేపాకు తురుము- పావుకప్పు, ఉప్పు-సరిపడా
నూనె- వేయించడానికి తగినంత

తయారుచేసే విధానం:
సెనగపప్పుని నాలుగైదు గంటలు నాననివ్వాలి. తరువాత అందులో ఒలిచిన చిక్కుడుగింజలు, ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.

ఇప్పుడు అందులో కొత్తిమీర, కరివేపాకు తురము, ఉప్పు, ఉల్లిముక్కలు వేసి కలిపి చిన్నచిన్న వడల్లా వేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.

Beans

చిక్కుడుకాయ పచ్చడి

కావలసినవి
చిక్కుడుకాయలు- అరకిలో,కారం-75గ్రా
ఉప్పు-తగినంత, నూనె-200గ్రా, నిమ్మకాయలు-ఆరు, మసాలాపొడి-2 టీస్పూన్లు, అల్లంవెల్లులి-2 టీస్పూన్లు, పసుపు-అరటీస్పూను

తయారుచేసే విధానం:
బాణలిలో నూనె వేసి కాగాక ఈనెలు తీసిన చిక్కుళ్లను వేసి వేయించి తీయాలి. ఇప్పుడు వీటిని ఓ వెడల్పాటి గిన్నెలో వేయాలి. ఆ నూనెలోనే అల్లం వెల్లులి వేసి వేయించి దించి చల్లారనివ్వాలి.

చిక్కుడుకాయలు పూర్తిగా వేడి తగ్గాక వాటిమీద కారం, మసాలాపొడి, ఉప్పు, పసులు వేసి కలపాలి. తర్వాత నూనెతో సహా వేయించిన అల్లం వెల్లుల్లి కూడా వేసి కలపాలి. చివరగా నిమ్మకాలన్నీ రసం పిండి, ఆ రసాన్ని అందులో వేసి కలిపి రాక సీసాలో పెట్టుకుంటే సరి.

చిక్కుడుకాయ కూటు

కావలసినవి-
చిక్కుడుకాయలు-పావుకిలో
పెసరపప్పు- అరకప్పు, పసుపు-పావ్ఞటీస్పూను, తాజా కొబ్బరితురుమ- అరకప్పు
ఎండుమిర్చి- నాలుగు, జీలకర్ర- టీస్పూను, కరివేపాకు -2 రెబ్బలు, ఉప్పు-తగినంత
ఆవాలు- పావుటీస్పూను, నూనె-2 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు-టీస్పూను

తయారు చేసేవిధానం:
ముందుగా చిక్కుడుకాయల్లో కొద్దిగా నీళ్లుపోసి, పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన ఉంచాలి. పెసరపప్పుని నానబెట్టి విడిగా ఉడికించి ఉంచాలి. మిక్సీలో కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బాలి.

బాణలిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు వేసి వేగాక మసాలా వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయలు వేసి ఓ నిమిషం వేగనివ్వాలి. తరవాత ఉడికించిన పెసరపప్పు కూడా వేసి కలిపి మూతపెట్టి ఐదునిమిషాలు ఉడికించి దించాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/