ఇరాన్ సైనిక శక్తిని పెంచాలి

Ali Khamenei
Ali Khamenei

టెహ్రాన్‌: ఇరాన్‌ కు చెందిన సుప్రీం నాయకుడు అమతోల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని నిరోధించడానికి, శత్రువుల బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇరాన్‌ ఇంకా బలంగా తయారు కావాలని ఖమేనీ అన్నారు. 1979 ఇస్లామిక్‌ విప్లవం తర్వాత దశాబ్దాలుగా అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్‌ బలమైన వైమానిక దళాన్ని తయారు చేసుకోగలిగిందన్నారు. శనివారం వైమానిక దళం కమాండర్స్, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ భయం, శత్రు భయం లేకుండా మనం పటిష్టంగా తయారు కావాలని పిలుపునిచ్చారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/