యువతిపై మైనర్ల సామూహిక అత్యాచారం

Woman gang raped by minors
Woman gang raped by minors

మహబూబాబాద్‌: తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో స్నేహం చేసిన ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు బాలుడు. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెను నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్లి అతని స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడినవారంతా మైనర్లే కావడం గమనార్హం. ఈ ఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌ గ్రామీణ మండలంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనులు చేస్తున్నాడు. అయితే అక్కడ అతనికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది.

అయితే ఇటీవలే సొంతూరుకు వచ్చిన ఆ బాలుడు యువతికి ఫోన్‌చేసి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. మహబూబాబాద్‌ పట్టణానికి చేరుకున్న ఆమెను తొలుత ఆటోలో తండాకు తీసుకెళ్లి అక్కడి నుంచి సమీపాన ఉన్న మామిడి తోటకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఆ బాలుడి స్నేహితులంతా చేరుకున్నారు. అదే తండాకే చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన మరో ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు ఉన్నారు. వీళ్లంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు. ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రాత్రి 10 గంటల సమయంలో మామిడితోటలలో అరుపులు విని రహదారిపై వెళ్తున్న కొందరు అనుమానం వచ్చి డయల్‌ 100కు ఫోన్ చేసి సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/