ఛాలెంజర్స్ ముంగిట 192 పరుగుల భారీ లక్ష్యం

చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు

Chennai Super Kings huge score
Chennai Super Kings huge score

Mumbai : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 191 భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేనకు ఓపెనర్లు డుప్లెసిస్ (50), రుతురాజ్ గైక్వాడ్ (33) రాణించారు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా 28 బంతుల్లో 5 సిక్సులు, నాలుగు ఫోర్ల తో 62 పరుగులు సాధించాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో నాలుగు వరుస సిక్సులు బాదాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. . దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/