అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

భైంసా బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం

kishan reddy
kishan reddy

నిర్మల్‌: భైంసాలో అల్లర్లకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎవరినీ ఉపేక్షించి లేదని స్పష్టం చేశారు. ఆదివారం నాడు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు అరవింద్‌, బండి సంజ§్‌ు, సోయం బాపూరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ భైంసాలో పర్యటించారు. భైంసా అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ…భైంసా అల్లర్ల బాధితులు అధైర్యపడొద్దని, బాధితులకు తాము అండగా ఉంటామని అన్నారు. బాధితులను ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘర్షణలో చాలా మంది అమాయకులు నష్టపోయారని కిషన్‌ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకూ బాధితులకు ప్రభుత్వం తరపున సహకారం అందకపోవడం దురదృష్టకరం అన్నారు. బాధితులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/