రతన్‌ టాటాకు నెటిజన్ల ఫిదా!

Ratan Tata

ముంబై: వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని వ్యక్తి, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఏడాది అక్టోబరులో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టిన ఆయన అయిదు నెలల్లోనే మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదిం చారు. దీనిపై అనేక మంది నెటిజన్లు స్పందిస్తూ రతన్‌ టాటాకు శుభా కాంక్షలు తెలిపారు.

అందులో ఓ నెటిజన్‌ పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాను ఛోటు అని సంబోధిస్తూ కంగ్రాట్యు లేషన్స్‌ ఛోటు అంటు కామెంట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్‌ కాస్త వైరస్‌ అవ్వడంతో ఎంతో ఉన్నత మైన వ్యక్తిని ఛోటు అని పిలవడం ఆయన్ను అగౌరవపరచడం అవుతుందని, ఇది సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు.

కాగా, తన కామెంట్‌పై సదరు మహిళ స్పందిస్తూ, ఆయన ఎంతో మందికి ఆదర్శం. ప్రేమతో నేనేమైనా చెప్పగలను అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇక తాజాగా దీనిపై రతన్‌ టాటా స్పందించారు. ప్రతి ఒక్కరిలో ఓ పిల్లవాడు ఉంటాడని, దయ చేసి ఈ యువతిని మర్యాదగా చూసుకోండి. అంటూ స్మైలీ సింబర్‌ జత చేశారు. రతన్‌ టాటా ఈ రిప్లైతో మరోసారి నెటిజన్ల మనసులు దోచుకున్నారు. మీరు నిజంగా గొప్పవ్యక్తి. అద్భుతమైన సమాధానం అంటూ ఆయన్ను ఫాలోవర్స్‌ ప్రశంసిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/