రుషి సునాక్ పట్ల ఎంతో గర్వంగా ఉంది : నారాయణమూర్తి

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రుషి సునాక్

infosys-narayana-murthy-response-on-rushi-sunak-elected-as-uk-pm

న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. తాజాగా ఇన్ఫోసిన్ ఫౌండర్, రిషి సునాక్ మామ నారాయణ మూర్తి స్పందించారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రుషికి శుభాకాంక్షలు తెలిపారు. రుషి పట్ల ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ, మంచి పాలనను అందిస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు.

కాగా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అల్లుడే సునాక్. నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తి భర్తే రుషి సునాక్. స్టాన్ ఫోర్డ్ యూనివర్మిటీలో ఎంబీఏ చదివేటప్పుడు వీరిద్దరికీ పరిచయమయింది. ఆ తర్వాత వారిద్దరి మనసులు కలిశాయి. ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. రిషి, అక్షతామూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.