వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా సంస్కృతిలో దీపావళికి చోటుకల్పించారంటూ భారతసంతతికి బైడెన్ అభినందనలు

joe-biden-hosts-white-houses-biggest-ever-diwali-celebration

వాషింగ్టన్: అమెరికా వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహారిస్‌ పాల్గొన్నారు. దీపాలను వెలిగించి బైడెన్ వేడుకలను ప్రారంభించారు. బైడెన్ మాట్లాడుతూ.. అమెరికా సంస్కృతిలో దీపావళిని చేర్చినందుకు భారత సంతతికి, దేశంలో ఉన్న భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు. దీపావళి సందర్భంగా విందు ఇవ్వడం తనకు గర్వకారణమని బైడెన్ చెప్పారు.

ఈ వేడుకల్లో సుమారు 200 మందికిపైగా భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. యూఎస్‌లో ఉన్న భారతీయులకు బైడెన్, కమలాహారిస్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రవాస భారతీయులకు కమలాహారిస్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ వైట్‌హౌస్‌ ప్రజల ఇల్లు, మా అధ్యక్షురాలు, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌తో కలిసి సంప్రదాయ వేడుకను నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని కమలాహారిస్‌ అన్నారు.