కరోనా అనుమానం..కార్యాలయ భవనం ఖాళీ

ముందు జాగ్రత్తలో భాగంగా ఐఐపీఎం కార్యాలయం ఖాళీ

infosys
infosys

బెంగళూరు: కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరులోని ఓ ఉద్యోగికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తమ శాటిలైట్ కార్యాలయాల్లో ఒక భవనాన్ని ఖాళీ చేయించింది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ పని చేసినట్టు ఇన్ఫోసిస్ ధ్రువీకరించింది. ఆ ప్రాంగణాన్ని మొత్తం శుభ్ర పరుస్తామని చెప్పింది. సదరు ఉద్యోగి.. కరోనా బాధితుడిని కలిసినట్టు అనుమానిస్తున్నారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తమ ఐఐపీఎం కార్యాలయాన్ని ఖాళీ చేయించామని ఇన్ఫోసిస్ అధికారి గురురాజ్ దేశ్పాండే వెల్లడించారు. ఈ విషయంలో ఉద్యోగులు అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని తమ ఉద్యోగులకు సంస్థ విజ్ఞప్తి చేసింది.

తాజా ఏపి వార్తల కోసంక క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/