నేడు కాశ్మీర్‌లో విదేశీ ప్రతినిధుల పర్యటన

16 foreign diplomats
16 foreign diplomats

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ-కాశ్మీర్‌లో స్థితిగతులను, భద్రతా పరమైన అంశాలను పరీశీలించేందుకు దాదాపు 16 మంది విదేశీ ప్రతినిధులు ఈరోజు కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొందన్న విషయాన్ని చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విదేశీ ప్రతినిధులను ఆహ్వానించింది. గత ఏడాది కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ని ఎత్తివేసిన తర్వాత కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం అక్కడ ప్రశాంత నెలకొందని ప్రభుత్వం పేర్కొంది. విదేశీ ప్రతినిధుల బఅందంలో యురోపియన్‌ యూనియన్‌ నేతలు ఉంటారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఈయూ బృంద ప్రతినిధులు కొందరు కాశ్మీర్‌కు వెళ్లడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/