వ్యక్తిగత పూజ ప్రాధాన్యం

అధ్యాత్మిక చింతన

Bhagwan Mahavir
Bhagwan Mahavir

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమబుద్ధుడు, మహావీరుడు, గురునానక్‌, రామకృష్ణ పరమహంస, గాంధీజీ ఇలాంటి మహనీయులను, మహాత్ములను, సత్పురుషులను మనమెంతో పొగడుతాం. గౌరవిస్తాం, పూజిస్తాం, వారి జయంతులను, వర్ధంతులను జరిపిస్తాం.

ఉత్సవాలు జరుపుకొంటాం, ఉల్లాసంగా పాటలు పాడుతాం, భజనలు చేస్తాం, కానీ వారి బోధనలను పాటించడం, వారు సూచించినట్టు జీవించం, వారు చూపిన బాటలో పయనించం.

వారంతా మనతో పూజలు చేయించుకోవటానికి ఈ లోకానికి వచ్చిపోయారా లేక ఎలా జీవించాలో మనకు ప్రత్యక్షంగా చూపడానికి వచ్చారా? వారెవరూ వ్యక్తిపూజను అంగీకరించేవారు కారు.

అంతెందుకు? నిన్న మొన్నటి బి.ఆర్‌.అంబేద్కర్‌గనీ, ప్రపంచప్రఖ్యాత రష్యన్‌ రచయిత లియోటాల్‌స్టా§్‌ుగానీ వ్యక్తి పూజను చేయటానికిగానీ, చేయించుకోవటానికి గానీ ఏ మాత్రమూ ఇష్టపడేవారు కారు.

ఈ సందర్భంలో టాల్‌స్టా§్‌ు జీవితంలోని ఒక సంఘటనను గుర్తు చేసుకోవాల్సి ఉంది.

ఒకసారి అమెరికా నుంచి ‘వర్డ్‌్‌ ఆర్ట్‌ (ప్రపంచకళ) అనే పత్రిక సంపాదకుడు ఎస్‌.పి.డయాగితో, నాటక ప్రొడ్యూసర్‌ డి.వి.ఫిలోసోఫో అనువారు టాల్‌స్టా§్‌ు వద్దకు వచ్చారు. ‘మీ దేశంలో అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక మహాకవి పుష్కన్‌.

ఆయన శతజయంతి ఉత్సవాన్ని మేం జరుపబోతున్నాం. అందుకు మీరు సహాయపడాలి అని అడిగారు. నిజమే పుష్కిన్‌ చాలా ప్రతిభావంతుడే, గొప్పకవే, ప్రజాదరణ పొందినవాడే.

పుష్కిన్‌ 1799లో జన్మించాడు, ఆయన జననాన్ని రష్యన్లు ఊర్యోదయముతో పోల్చుకొంటారు, జార్‌ చక్రవర్తి పరిపాలనను సూర్యాస్తమయంతో కోల్చుకొంటారు.

వారికి పుష్కిన్‌ పట్ల ఎంత గౌరవమో మనం ఊహించుకోవచ్చు. అలాంటి రష్యన్‌ కవి జయంతి వేడుకలను జరపటానికి అమెరికన్లు ముందుకు వచ్చి అందుకు సహాయపడవలసిందిగా మరొక రష్యన్‌, సుప్రనిద్ధ రచయిత అయిన టాల్ స్టాయ్ ..ఆయన ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యమౌతుంది.

వారితో ఆయన పుష్కిన్‌ ఎంతగొప్ప సాహిత్యవేత్తయినా ఆయనకు వ్యక్తిపూజ చేయడం తనకు నచ్చదన్నాడు.

ఇలా చేసే ఉత్సవాలన్నీ పైపై మెరుగులే అవ్ఞతాయి. ఎంతగొప్ప వ్యక్తయినా కాలగర్భంలో కలిసిపోవాలసిందే.

మీరు చేసే శతజయంతి ఉత్సవానికి నేనేమీ ఉపయోగపడను అని అనగానే అసంతృప్తితో వారు లేచి వెళ్లిపోయారు (పుటలు 85-86 )

టాల్ స్టాయ్ మతం సాహిత్యం మిక్కిలినేని అక్కయ్య అరవింద పబ్లిషర్స్‌) నిజానికి పుష్కిన్‌ అంటే చాలా గౌరవం.

అయినా నిర్మోహమాటం గా శతజయంతి ఉత్సవానికి తోడ్పడనని కచ్చితంగా చెప్పేవాడు.

హిందూమత ప్రత్యేకతను, విశిష్టతను గూర్చి వివరిస్తూ వివేకానందస్వామి హిందూమతా న్ని ‘సనాతన ధర్మం అని అంటారని ఇది.వ్యక్తులపైన కాక, సిద్ధాంతాల పైన ఆధారపడినదని చెబుతారు.

ఒకవేళ శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని పక్కనపెట్టినా ఈ సనాతన ధర్మానికి వచ్చేనష్టమేమి లేదని చెబుతారు.

వ్యక్తిగత పూజకిచ్చే ప్రాధాన్యతను, ఆ వ్యక్తి బోధకిచ్చి తదనుగుణంగా జీవిస్తే మనం బాగుపడతూ, మన సంఘం బాగుపడుతుంది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/