తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు
వైకుంఠం కంపార్టుమెంట్లలో వేచిఉండేందుకు స్వస్తి
ముంబయిలో ఆలయ భూమిపూజ నిలిపివేత
19నుంచి ధన్వంతరి మహాయాగం : టిటిడి

తిరుమల: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రమవుతున్న నేపధ్యంలో కలియుగవైకుంఠం తిరుమలకు వచ్చే భక్తులపై చూపకుండా నివారించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
భక్తులు ఎక్కువగా వుండే ఆర్జితసేవలు ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజ, బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం, రోజూ జరిగే వసం తోత్సవ సేవలనురద్దుచేశారు.
అంతేగాక వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లలో వేచివుండే విధానాన్ని తాత్కాలికంగా రద్దుచేశారు.
ఆ స్థానంలో భక్తులు టైమ్‌స్లాట్ టోకెన్లు పొందితేనే దర్శనా నికి అనుమతిస్తారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/