అమెరికా లో ఖలేజా నటుడి ఫై దాడి

అమెరికా లో ప్రముఖ పంజాబీ నటుడు అమన్ ధలీవాల్‌పై దాడి జరిగింది. కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో ఉన్న అమన్ ధలీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసాడు. ఈ దాడిలో అమన్ ధలీవాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. జిమ్ లో అందరు చూస్తుండగా ఆయనపై ఈ దాడి జరిగింది. వెంటనే జిమ్ సిబ్బంది గాయపడిన అమన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ దాడికి కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. నిందితుడు దాడిచేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని మాన్సాకు చెందిన ధలీవాల్ పంజాబీ, హిందీతోపాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ నటించిన జోదా అక్బర్ సినిమాలో రాజ్‌కుమార్ రతన్‌సింగ్ పాత్ర పోషించారు. తెలుగులో ఖలేజా సినిమాలో నటించారు.