కివీస్‌పై టీమిండియా మరో గెలుపు

IND vs NZ 2nd t20 india win by NZ
IND vs NZ 2nd t20 india win by NZ

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌ విజయం సాధించింది. భారత్‌కు కివీస్‌ 133 పరుగుల లక్ష్యాన్ని ముదుంచగా, భారత్‌ దానిని 17 ఓవర్లలోనే 135 పరుగులు చేసి గెలుపు బాట పట్టింది. ఆక్లాండ్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించి ఆతిథ్య కివీస్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కివీస్ విసిరిన 133 పరుగుల లక్ష్యాన్ని మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) విఫలమైనా సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ కు శ్రేయాస్ అయ్యర్ కూడా తోడవడంతో న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. అయ్యర్ 33 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 44 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు. ఆక్లాండ్ లోని ఇదే మైదానంలో జరిగిన తొలి టి20లో సైతం భారత్ నే విజయలక్ష్మి వరించింది. ఇరు జట్ల మధ్య మూడో టి20 జనవరి 29న హామిల్టన్ లో ని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/