జాంబియాలో కలరా కలకలం.. మానవతా సాయం చేసిన భారత్

India sends 3.5-tonne humanitarian aid to Zambia as cholera kills nearly 600 people

న్యూఢిల్లీః ఆఫ్రికన్ దేశం జాంబియా కలరా మహమ్మారి వలలో చిక్కి విలవిల్లాడుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఈ చిన్న దేశంలో కలరా కారణంగా అక్టోబరు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికిపైగా మహమ్మారి వలలో చిక్కారు. దేశంలోని 10 ప్రావిన్సులలో 9 ప్రావిన్సులు కలరా గుప్పిట్లో చిక్కాయి.

గతంలో ఎన్నడూ లేనంతగా ఆరోగ్య సంక్షోభంతో అల్లాడుతున్న జాంబియా పరిస్థితిపై భారత్ స్పందించింది. నీటిశుద్ధి యంత్రాలు, కలరా నివారణ ఔషధాలు, డీ హైడ్రేషన్ బారినుంచి కాపాడే ఓఆర్ఎస్ సాచెట్లు వంటి సామగ్రితో కూడిన 3.5 టన్నుల మానవతా సాయం పంపినట్లు అధికారులు వెల్లడించారు.

స్టేడియాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తోంది. సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అధికారులు ప్రభావిత ప్రాంతాలకు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా చేపట్టారు.