ఏసీబీ వలలో మరో అవినీతి చేప

ఆర్డర్ ఇవ్వటానికి రూ.60వేలు లంచం

ACB
ACB

Rajahmundry: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. రాజమండ్రి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఆఫీస్, సీనియర్ అసిస్టెంట్  రాజేంద్ర ప్రసాద్ ఏసీబీకి చిక్కారు.

ఓ  వ్యాపారి నుంచి లంచం తీసుకుంటుండగా రాజేంద్ర ప్రసాద్ ను అధికారులు పట్టుకున్నారు.

వ్యాపారి వద్ద నుంచి సంస్థకు సంబంధించిన CST రీ అసెస్మెంట్ 2016-2017 సంవత్సరము కు ,  అసెస్మెంట్ ఆర్డర్ ఇచ్చుటకు రూ.60,000/- లంచం అడిగి తీసుకుంటుండగా రాజమండ్రి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

లంచం డబ్బు మరియు సంబంధిత రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. నిందితున్ని రాజమండ్రి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/