రెండోసారి కూడా భారత్‌కు కాంస్యమే…!

మనీలా (ఫిలిప్పీన్స్): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండో సారి కాంస్యంతోనే సరిపెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేసియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 2-3తో ఓడి ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆసియాడ్ చాంపియన్ జొ నాథన్ క్రిస్టీపై యువ రాకెట్ లక్ష్య సేన్ సంచలన విజయం వృథా అయింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ఆంథోనీ సునిసికా జింటింగ్‌తో పోరులో 6-21తో వెనుకంజలో ఉన్నప్పుడు సాయి ప్రణీత్ రిటైరయ్యాడు. అయితే, తర్వాత జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21-18, 22-20తో జొనాథన్ క్రిస్టీపై నెగ్గి 1-1తో స్కోరు సమం చేశాడు.
డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ కపిల జంట 10-21, 21-14, 21-23తో ఎహ్సాన్హెంద్ర సెథియవాన్ జోడీ చేతిలో ఓడింది. మరో సింగిల్స్‌లో శుభాంకర్ డే 21-17, 21-15తో రుస్తావిటోపై నెగ్గి 2-2తో స్కోరు సమం చేశారు. కానీ, నిర్ణయాత్మక డబుల్స్ మ్యాచ్‌లో లక్ష్య సేన్చిరాగ్ షెట్టి 6-21, 13-21తో ఫెర్నాల్డి గిడియన్కెవిన్సుకముల్జో చేతిలో పరాజయంతో భారత్ ఓటమి ఖరారైంది. 2016లోనూ భారత పురుషుల టీమ్ సెమీఫైనల్లో ఇండోనేసియా చేతిలో ఓటమిపాలై కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/