ప్రణాళికలు అమలు చేయడంలో బౌలర్లు విఫలం
తాము నిర్ధేశించిన స్కోరు తక్కువేమీ కాదు

ఆక్లాండ్: టీమిండియాతో జరిగిన తొలి టీ20లో తాము గెలవడానికి ఎన్నో సానుకూల అంశాలు ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవడంలో విఫల కావడంతో పరాజయం చెందినట్లు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమన్స్ పేర్కొన్నాడు. తాము నిర్దేశించిన స్కోరు తక్కువేమీ కాదని, కానీ దానిని కాపాడుకోవడం సాధ్యం కాలేదన్నాడు. తమ పేస్ బౌలింగ్ విభాగం బాగానే ఉన్నప్పటికీ ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయడంలో బౌలర్లు విఫలం చెందారన్నాడు. ఈ పిచ్‌పై రెండొందలు మంచి స్కోరేనని, అసలు తమకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన భారత్‌కే మొత్తం క్రెడిట్ చెందుతుందన్నాడు. భారత్ ఆటగాళ్లు తమకు ఏ సమయంలోనూ అవకాశం ఇవ్వలేదని, ఎదురుదాడికి దిగి తమను ఒత్తిడిలోకి నెట్టారన్నాడు. దాంతోనే పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నాడు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/