తోటమాలి అవతారమెత్తిన ధోని

సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు ఉంచిన సాక్షిధోని

dhoni
dhoni

రాంచి: కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమిత మయ్యారు. ఇందులో సెలబ్రెటీలు ఏమి మినహయింపు కాదు. పొద్దు గడిపేందుకు వారు రకరకాల పనులు చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని కూడా అదేబాట పట్టాడు. తన విశాలమైన ఇంటి గార్డెన్‌ పనులు చేస్తూ బిజిగా గడుపుతున్నాడు. ధోని లాన్‌ మోవర్‌ను చేతపట్టి ఇంటి ముందు బాగంలో పెరిగిన గడ్డిని చదును చేస్తుండగా తీసిన ఫోటోలను అతని భార్య సాక్షిధోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/