ధనస్వామ్యంతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల ద్వారా ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. దీనివలన వ్యయం తగ్గడంతో పాటు ఫలితాలు స్వల్పకాలంలో వస్తాయి. కానీ ఎక్కువగా రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి బ్యాలెట్‌ వ్యవస్థకే మొగ్గుచూపుతున్నాయి.

Democracy in danger

ఓటర్‌లు చైతన్యం పొందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని విధితమవ్ఞతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లకు నోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం అనే విధానానికి రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు స్వస్తిచెప్పి అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామనే భరోసాను ఓటర్‌లలో కల్పించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉందనేది జగమెరిగిన సత్యం.

భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో ఓట్లకు నోట్లు అనేది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు గాలం వేయడం పరిపాటి అయింది. బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ గొప్పదిగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రా యుధంగా ప్రజలే ప్రభువ్ఞలుగా భారత రాజ్యాంగం ప్రకారం 326 నిబంధన ద్వారా ప్రతి పౌరుడికి కులమత బేధం లేకుండా కల్పించబడుతుంది.

కానీ ఓటర్లను ప్రలోభపెట్టడం ఎన్నికలు వచ్చాయి అంటే పోటీ చేసే ఆర్థికస్తోమత కలిగిన వ్యక్తులు లక్షలలో డబ్బులు వెదజల్లడం అనేది ప్రస్తుతం అనివార్యమైంది. డబ్బు ఉన్న వారికే రాజకీయ పట్టం, డబ్బులు లేని వారికి రాజకీయాల్లో చోటు లేదనే భావన మనదేశంలో చోటు చేసు కోవడం గర్హనీయం. ఇతర ప్రజాస్వామ్యదేశాలలో ఓటర్లను ప్రలోభపెట్టి డబ్బులు పంపిణీ చేసే ఆనవాయితీ ఇసుమంతైనా లేదు కానీ మనదేశంలో పోటీ చేసే అభ్యర్థులు వివిధ ప్రాంతా లలో కులాలు, మతాలు వర్గాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకుని వివిధ రూపాల్లో ఓట్లను కొనుగోలు చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.

నీతి నిజాయితీ సమర్థత విద్యావంతులకు రాజకీయాల్లో చోటు లేదనేది మేధావ్ఞల మదిని తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటీవల జరిగిన పురపాలక నగరపాలక సంస్థల్లో ఓట్ల కోసం అభ్యర్థులు నానా హైరానా పడ్డట్టు అవగతమవ్ఞతుంది. ఇకపోతే ఆర్థికస్తోమత కలిగిన నాయకులు ఎన్నికల్లో ఖర్చుపెట్టినా కాని వారు నిలదొక్కుకునే సామర్థ్యం కలిగి ఉండరు. కానీ ఆర్థికస్తోమత అంతంత మాత్రంగా ఉండి పోటీకి సై అన్న అభ్యర్థులు గెలిస్తే పర్వాలేదు కానీ ఓడిపోతే వారి బాధ వర్ణనాతీతం అనేది నిష్టూర సత్యం.

ప్రజాస్వామ్యం అంటే ఓట్లను కొనుగోలు చేయడమేకాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకొని ప్రజాసేవే పరమావధిగా పాటుపడేలా కృషి చేయడం కానీ ఇటీవల ఖర్చు పెట్టి తదుపరి గెలిచిన అనంతరం వాటిని ఎలా పూడ్చుకోవాలనే తాపత్రయం ప్రజాప్రతినిధులలో తహతహ కొట్టొచ్చినట్లు కని పిస్తుంది. ఓడిన అభ్యర్థుల విషయానికొస్తే అప్పు తెచ్చి మరీ ఎన్నికల బరిలో దిగడం చూస్తుంటే వారి ఆర్థిక పరిస్థితి మరింత పీకల్లోతు కూరుకుపోయేలా దిగజారే పరిస్థితి దాపురించింది.

ఇలా ఓట్లకు అమ్ముడుపోయే ప్రక్రియ ఉంటే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదకరమని చెప్పవచ్చు. ఇటీవల కొందరు విజ్ఞులైన మేధావ్ఞలు తమ గృహాల ముందు ఇచ్చట ఓట్లు అమ్మబడవ్ఞ అనే ఫ్లెక్సీలు పలు పట్టణాల్లో దర్శనమివ్వడం చూస్తుంటే సమాజంలో కొంతమేరకు ఓటర్లలో చైతన్యం వచ్చినట్లు ద్యోతకమవ్ఞతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్‌ ద్వారా గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు పోటీ చేసే అవకాశం అభ్యర్థులకు కల్పించడంతోపాటు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ గుర్తులను కేటాయిస్తుంది.

అర్హులైన ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలను తమకు అందివ్వాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ సరైన రీతిలో వారు ఖర్చుల వివరాలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదనే వాదన కూడా ఇటీవల వినిపిస్తోంది. ప్రధాన పార్టీలు కొన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తున్నామని బడా పార్టీలు డబ్బులు ఇచ్చినా తీసుకుని తమను ఆదరించాలని ప్రాధేయపడుతున్నప్పటికీ ఓటర్‌ మహాశయులు కనికరించడం లేదు. ఎన్నికలలో పాక్షికంగా ఖర్చుపెడుతున్నాయి.

ప్రజాస్వా మ్యంలో నీతి నిజాయితీ ద్వారా పజాస్వామ్య వ్యవస్థను పరి రక్షించుకోవలసిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇలాగే ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగితే గెలిచిన అభ్యర్థులలో కూడా అవినీతి చోటు చేసుకొని కోట్లకు పడగలెత్తి అభివృద్ధికి ఆటంకం జరిగే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ అర్హత నిబంధనలు ఎన్నికల కమిషన్‌ రూపొంది స్తుంది. దానికి అనుగుణంగా అభ్యర్థుల పోటీ గెలుపు, ఓటమి అనేది ఉంటుంది.

కానీ ఎన్నికలు అంటే ఓట్లకు నోట్లు వివిధ రూపాల్లో ప్రలోభపెట్టడం ఏ మాత్రం సముచితం కాదనే వాదన కూడా విస్తృతమైన రీతిలో ఇటీవల చర్చల్లో కనిపిస్తుంది. ఎన్నికలంటే నోట్లకు ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియకు స్వస్తి చెప్పి గెలిచిన ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు నడుంబిగించి ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసినట్లయితే ప్రజా స్వామ్యవ్యవస్థ ద్వారా ప్రజలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల ద్వారా ప్రజలుఓటు హక్కు ను వినియోగించుకుంటున్నారు.

దీనివలన వ్యయం తగ్గడంతో పాటు ఫలితాలు స్వల్పకాలంలో వస్తాయి. కానీ ఎక్కువగా రాజ కీయ పార్టీలు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి బ్యాలెట్‌ వ్యవస్థకే మొగ్గుచూపుతున్నాయి.

ఓటర్‌లు చైతన్యం పొందడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని విధితమవ్ఞతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లకు నోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం అనే విధానానికి రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు స్వస్తిచెప్పిఅభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తామనే భరో సాను ఓటర్‌లలో కల్పించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడు కునే స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉందనేది జగమెరిగిన సత్యం.

  • ఉయ్యాల నర్సయ్యగౌడ్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/