చంద్రబాబు విషయంలో పోలీసుల తీరు సరికాదు

సీఎం జగన్‌ కాన్వాయ్‌ వస్తుంటే దుప్పట్లు అడ్డుపెట్టారు!

varla ramaiah
varla ramaiah

విశాఖ: టిడిపి అధినేత చంద్రబాబు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని ఆ పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. చంద్రబాబు అరెస్టుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో సీఎం జగన్‌ కాన్వాయ్‌ వస్తుంటే దుప్పట్లు అడ్డుపెట్టినట్లే ..పోలీసులు ఇప్పుడు కూడా వ్యవహరించాల్సిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని చూసి సీనియర్‌ ఐపీఎస్‌లు బాధపడుతున్నారని, శాంతి భద్రతల్ని పోలీసులు ఎందుకు అదుపు చేయలేపోయారని వర్లరామయ్య ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలను అరెస్టు చేయకుండా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అని నీలదీశారు. ప్రతిపక్షంలో ఉంటే పక్షపాతం చూపిస్తారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు పక్షపాతం చూపలేదని గుర్తుచేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/