‘నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయితే బాగుంటుంది’

‘మండలి’ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి

Gutta Sukhendar Reddy with the media
Gutta Sukhendar Reddy

Nalgonda: ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్‌ అన్ని విధాలుగా అర్హుడని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు.

కేటీఆర్‌ డైనమిక లీడర్‌ అని, ఆయనకు సీఎం పదవిపై టీఆర్‌ఎస్‌ పార్టీలో ఏం చర్చ జరుగుతుందనే విషయం తనకు తెలియదని చెప్పారు.

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుంటుందనేదని అభిప్రాయపడ్డారు. అయినా పార్టీ గుర్తును బట్టి గెలుపు ఓటములు ఉంటాయి, గతంలో జానారెడ్డి కూడా ఓడిపోయారని గుర్తుచేశారు. టికెట్‌ ఎవరికి ఇస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/