ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

ఆరుగంటల పనివిధానం ఉండాలి: – బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

కరోనా వ్యాధి వ్యాప్తితో కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను పట్టాలు ఎక్కించేందుకు కేవలం పరిశ్రమలకు అనుమతులు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడంతోనే ఫలితాలురావ్ఞ. దేశా న్ని పట్టిపీడిస్తున్న పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తరిమి కొట్టా ల్సి ఉంది.

అందుకు తగిన ఆమోదయోగ్యమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ముఖ్యం గా కార్మికుల పనిగంటలు 8 నుండి 6కు తగ్గించిననాడు కొన్ని సమస్యలకు వాటికవే పరిష్కారాలు లభిస్తాయి.

24 గంటల ఒక పనికి ముగ్గురు కార్మికులు అవసరం అవుతున్న ప్పుడు అదేపనిని పనిగంటలు 6కు తగ్గిస్తే నలుగురు కార్మి కులు కావాల్సి ఉంటుంది. అంటే అదనంగా ఒక కార్మికుడు కావాల్సి ఉంటుంది.అదనంగాఒక కార్మికుడికి ఉపాధి కల్పించి నట్లవ్ఞతుంది.

వలస కూలీలకు విముక్తి ఏది?:- ఎల్‌.ప్రపుల్లచంద్ర, ధర్మవరం

పాపం వలస కూలీల పరిస్థితి హృదయవిచారకం. సుదూర ప్రాంతాలకు రైలుపట్టాలపై పయనించి రైళ్లు నడవడం లేదని తెలిసి పట్టాలపైనే నిద్రించి తమ నిండుప్రాణాలు తీసుకున్నా రు. గూడ్స్‌రైళ్లు నడుస్తాయని వారికేం తెలుసు.

అభం శుభం ఎరుగని అమాయకులు వలసకూలీలు వీరి ప్రయాణం గమ్యం తెలియనిది మన భారతావనిలో వలసకూలీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం వెళ్లాలంటే కరోనాకట్టడి, లాక్‌డౌన్‌ సమస్యలు నడకలో ఎంత దూరం వెళ్లగలరు. వలస కూలీలను ప్రభుత్వం వారివారి స్వస్థలాలకు వారిని పంపించాలి.

ప్రజారవాణాకు చర్యలు తీసుకోండి:- పి.రూతు, హైదరాబాద్‌

లాక్‌డౌన్‌ మేనెల 31వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. తెలం గాణ ప్రభుత్వం మే 28వరకు పెంచింది. ఈ సమయంలో ప్రజారవాణ అయిన ఆర్టీసీ బస్సులను నడపాలి. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నారు.

వారికి వచ్చే అరకొర జీతాలతో రోజూ ప్రైవేటు వాహనాలలో వెళ్లలేక, ఉద్యోగులు దీర్ఘకాలంగా సెలవ్ఞపెట్టి, జీతాలు లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వంకొన్ని నిబంధనల తో బస్సులను నడిపితే బాగుంటుంది. యాజమన్యం ప్రభు త్వ అనుమతి కోసం వేచివ్ఞన్నది.

ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ బస్సులను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించి, నడపాలి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంలాగా బస్సులకు అనుమతి ఇవ్వాలి.

సామాజిక దూరం సాధ్యమేనా!:-వరప్రసాద్‌, మేల్చేల్‌, హైదరాబాద్‌

భారతదేశం వంటి అధికజనాభా ఉన్న దేశంలో కరోనా నేప ధ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ, మనుగడ సాగించడం భవిష్యతులో కష్టమైన పనే. వలస కూలీలను వారి స్వగ్రామా లకు తరలించేందుకు ప్రభుత్వం ఉచితంగా బస్సులను, రైళ్లను ఏర్పాటు చేశారు. దీంతో రైల్వేస్టేషన్లలో వేలసంఖ్యలో కూలీలు చేరుకున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో వేలాదిమంది వలసకూ లీలు ఏమాత్రం దూరాన్ని పాటించకుండా సాగిపోతున్నారు. కూరగాయల మార్కెట్లు, పండమార్కెట్ల వంటి ప్రాంతాల్లో ప్రజలు తండోపతండాలు రోడ్డుపైకి వచ్చి కూరగాయల్ని కొంటు న్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో వైరస్‌ మరింతగా పెరిగే అవ కాశం వ్ఞంది. ప్రజల్లో చైతన్యం లేనంతవరకు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు.

బకాయిలపై దృష్టిపెట్టండి:- గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గో.జిల్లా

లాక్‌డౌన్‌ నేపధ్యంలో విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌ తప్పిదాలతో వినియోగదారులు హడలెత్తిపోతున్నారు. విద్యుత్‌శాఖ అధికారు లు చెబుతున్నట్లుగా బిల్లులు రావడం లేదు. నిజానికి ప్రజలలో ఏ వర్గం వారూ కూడా పూర్తిగా ఆదాయాలు కోల్పోయి బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకుంటామని ప్రకటనలు ఇస్తున్నా, అవి ఆచరణలో అమ లకు నోచుకోవటం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి వారి బాధ లు వర్ణనాతీతం. పాలకులు రావలసిన బకాయీలపై దృష్టి పెట్టాలి.

ముఖ్యంగా పక్కరాష్ట్రం తెలంగాణ నుండి మన రాష్ట్రా నికి నాలుగువేల కోట్ల రూపాయలు విద్యుత్‌ బకాయిలూ రావ లసి వ్ఞంది. ఇప్పటికైనా అలాంటి బకాయీలను వసూలు చేసి ప్రజలకు బిల్లులకు రద్దు చేసి ఉపశమనం కలిగించాలి.

పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి: – సామ్యేల్‌, సుచిత్ర, హైదరాబాద్‌

కరోనాతో అనేక నష్టాలతో ప్రజలు సతమతమవుతున్నా రు. ఎప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారో తెలియదు. లాక్‌డౌన్‌ ముగిసేసమయం వచ్చేలోగానే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పొడిగిస్తున్నారు.

ఇది ఒకరకంగా మంచిదే. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ వసల కూలీలకు పనులు లేక, మధ్యతరగతి వారికి ఉపాధి లేక అర్థాకలితో అలమటిస్తున్నారు. కరోనా కంటే తమకు కడుపునిండడమే ముఖ్యమని భావిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/