ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త ను అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇదే జరిగింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య.

వివరాల్లోకి వెళ్తే..

జగద్గిరిగుట్ట లో జిమ్ ట్రైనర్ గా పనిచేసే జయకృష్ణ..అతడి భార్య దుర్గా గత కొంతకాలంగా చిన్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో జయకృష్ణను హత మార్చాలని ప్రియుడు చిన్నాతో కలిసి పధకం వేసింది. ఈ పథకంలో భాగంగా భర్తకు మద్యం తాగించింది. భర్త మద్యం మత్తులో ఉండగా అతడిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసింది. అనంతరం భర్త మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. అప్పుల బాధతో జయకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించే విధంగా చిత్రీకరించింది. జయకృష్ణ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుందనే సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈ సమయంలో జయకృష్ణ మృతదేహాం కనిపించడంతో పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానంతో జిమ్ ట్రైనర్ భార్య దుర్గతో పాటు ప్రియుడు చిన్నాని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో దర్యాప్తులో భర్తను భర్య చంపినట్లు బయటపడింది.