హైదరాబాద్ ఐకియా స్టోర్‌లో జాత్యంహకార వివక్ష ఘటన

హైదరాబాద్ ఐకియా స్టోర్‌లో జాత్యంహకార వివక్ష ఘటన కలకలంరేపుతుంది. హైదరాబాద్ అంటే దేశ ప్రజలకే కాదు విదేశాల ప్రజలకు కూడా ఎంతోమక్కువ..ఏడాదికి ఒకసారైనా హైదరాబాద్ కు వచ్చి ఇక్కడి అందాలను చూడాలని , కొన్ని రోజుల పాటు ఇక్కడ గడపాలని అనుకుంటున్నారు. అలాంటిది హైదరాబాద్ లో జాత్యంహకార వివక్ష ఘటన వార్తల్లో నిలిచేలా చేసింది.

నితిన్ సేథి అనే జర్నలిస్ట్ భార్య హైదరాబాద్‌లో ఉన్న ఐకియా స్టోర్‌లో కలిసి షాపింగ్ చేశారు. అయితే తమను మాత్రమే సెక్యూరిటీ పేరుతో ఇబ్బంది పెట్టి అవమానించారని నితిన్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్‌ కావడంతో నెటిజన్లు నితిన్ సేథికి మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఐకియా సిబ్బంది వ్యవహరించిన తీరు ఆమోగయోగ్యంగా లేదన్నారు. ఐకియా సిబ్బంది ఇలా చేయడం కరెక్ట్ కాదని.. నితిన్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాడని సూచించారు. కస్టమర్లతో గౌరవంగా ఎలా నడుచుకోవాలో సిబ్బందికి అవగాహన కల్పించాలని ఐకియా యాజమాన్యానికి సూచించారు.

దీనిపై ఐకియా యాజమాన్యం స్పందించింది. సమానత్వం మానవ హక్కు అని తాము విశ్వసిస్తామని పేర్కొంది. అన్ని రకాల జాత్యహంకారం, పక్షపాతాలను తాము ఖండిస్తున్నామని.. బాధితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ట్వీట్ చేసింది.