మరోసారి తెలంగాణపై తన ప్రేమను చాటుకున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ఫై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరి లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ..తనకు పోరాట పటిమను నేర్పిందే తన గుండెచప్పుడైన తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న ఐక్యత ఆంధ్రాలో లేదని అన్నారు. తెలంగాణలో ఏదైనా అన్యాయం జరిగితే అందరూ కలిసి గొంతెత్తుతారని.. కానీ ఏపీలో అలా ఉండదని తెలిపారు. శ్రీకాంతాచారి లాంటి ఎందరో తెలంగాణ సాధించడానికి తమ ప్రాణాలు కూడా లెక్కచేయలేదని.. కానీ అలాంటి ఐక్యత కరవని పవన్ కల్యాణ్ అన్నారు.

రీసెంట్ గా వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన పరిణామాలు, జనసేన కార్య కర్తల అరెస్ట్ లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ముఖ్యనేతలతో మంగళగిరిలో భేటీ అయ్యారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భాంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వైస్సార్సీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను గొడవల్లోకి లాగితే నాలుక చీరేస్తా.

తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా. నాపై బూతుల పంచాంగం విప్పే ప్రతి వాడిని నించోబెట్టి తోలు తీస్తా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగే మీరా చెప్పేది. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నార్రా. రండ్రా.. ఎంతమంది వైస్సార్సీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులొస్తారో రండి అంటూ ఛాలెంజ్ విసిరారు. యుద్ధం ఎప్పుడో చెప్పండి రా.. రాడ్ల.. హాకీ స్టిక్కులా.. ఉట్టి చేతులా? ఛాలెంజ్ విసురుతున్న నా కొడకల్లారా. తోలు తీస్తా నా కొడకల్లారా ఒక్కొక్కడికి. ఈరోజు నుంచి యుద్ధమే” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకోసారి తాను ప్యాకేజీ తీసుకున్నానని ఎవడైనా అంటే చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతానని హెచ్చరించారు.