ఐసిసి అత్యవసర సమావేశం

పాల్గోన్న బిసిసిఐ ప్రతినిధి సౌరవ్‌ గంగూలీ

sourav ganguly
sourav ganguly

దుబాయ్ : కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ కారణంగా క్రికెట్‌కు సంబందించిన అన్ని సీరిస్‌లు వాయిదా పడ్డాయి. అయితే వచ్చే అక్టోబర్‌ మాసంలో ఆస్ట్రేలియా గడ్డమీద జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌, ప్రపంచటెస్ట్‌ చాంపియన్‌ షిప్‌పై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలపై చర్చించేందుకు సభ్య దేశాలతో, అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాటుచేసింది. దీనిలో బిసిసిఐ ప్రతినిధిగా సౌరవ్‌ గంగూలీ పాల్గోన్నారు. ఈ సమావేశంలో సమగ్ర వ్యాపార కొనసాగింపు, అత్యవసర ప్రణాళికల గురించి చర్చించినట్లు ఐసిసి సీఈవో మనుసాహ్ని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/